- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Income Tax: లాస్ట్ మినిట్ వరకు టైం వేస్ట్ చేయద్దు.. టాక్స్ పేయర్లకి కీలక అప్డేట్
Income Tax Deadline: టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.

దిశ,వెబ్‌డెస్క్: Income Tax Deadline: టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. మళ్లీ ఐటీ రిటర్న్స్(IT Returns) దాఖలు చేసేందుకు సమయం దగ్గరపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియగానే ఐటీఆర్ ఫైలింగ్(ITR Filing) తేదీ వస్తుంది. ఈ నేపథ్యంలో గడువు సమీపిస్తున్న తరుణంలో పన్ను మినహాయింపు కోసం పథకాలను ఎంచుకునే వారు తొందరపడుతుంటారు. ఇలాంటి సమయంలో చిన్న పొరపాటు చేసినా దీర్ఘకాలంలో దాని ఫలితం మాత్రం ప్రతికూలంగానే ఉంటుంది. అందుకోసమే పన్ను ఆదా స్కీములను ఎంచుకొనేటప్పుడు అవి మన లక్ష్య సాధనలో ఎంత వరకు ఉపయోగపడతాయనేది తెలుసుకోవాలి. పన్ను మినహాయింపు పెట్టుబడుల కోసం చూస్తున్నప్పుడు ముందుగా మనం నిర్ణయించుకోవాల్సిన విషయం ఏ పన్ను విధానంలో ఉండాలని అనేది. కొత్త , పాత పన్ను విధానా(Old tax system)ల్లో ఏది ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత ఉండాలి.
ఇప్పటికే మీరు పనిచేసే కంపెనీ మీ నిర్ణయం ఏమిటనేది అడిగి తెలుసుకుంటుంది. ఎలాంటి మినహాయింపులు క్లెయిమ్ చేసుకోనప్పుడు కొత్త పన్ను విధానంలోకి మారడం మంచిది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సి పెట్టుబడులు, హోంలోన్(Home Loan) పై చెల్లించిన వడ్డీ, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం(Health insurance premium) వంటి మినహాయింపులు చూయించాలనుకున్నప్పుడు పాత పన్ను విధానం ఎంచుకోవాలి. ఏ పన్ను విధానంలో ఎంత బెనిఫిట్ ఉంటుందో మీ సంస్థలో సంబంధిత విధానం అడిగి తెలుసుకోవడం మంచిది. ఇన్ కమ్ ట్యాక్స్ ఇ ఫైలింగ్(Income Tax E-Filing) పోర్టల్లోనూ కాలిక్యూలేటర్ అందుబాటులో ఉంటుంది.
పన్ను వర్తించే ఆదాయం లెక్కించేటప్పుడు మీకు వస్తున్న మొత్తం ఆదాయాలను పరిగణలోనికి తీసుకోవాలి. వేతనంతోపాటు రెంట్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ నుంచి వడ్డీ వ్యాపార ఆదాయం, మూలధన రాబడి షేర్ల నుంచి వచ్చే డివిడెంట్స్, ఇతర మార్గాల్లో ఆదాయం ఉన్నప్పుడు వాటన్నింటిని ఒకేచోట రాసి పెట్టుకోవాలి. దీంతోపాటు ఇతర టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్(Tax Savings Schemes) లో ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు. ఇంకా ఎంత అవకాశం ఉందనేది చూడాలి. దీని వల్ల ఎంత పన్ను భారం పడుతుందనేది స్పష్టత కూడా వస్తుంది. తర్వాత మీరు పన్ను ఆదా కోసం ఎంత మదుపు చేయాలనేది చూసుకోవచ్చు.
పన్ను ఆదా అంటే సెక్షన్ 80సి నే గుర్తుకువచ్చేది పీపీఎఫ్(ppf), ఈపీఎఫ్(epf), ఈఎల్ఎస్ఎస్(elss), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హోంలోన్ అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు ఇలా ఎన్నో పెట్టుబడి స్కీములు వస్తాయి. ఇక మొత్తం మీద రూ. 1.50లక్షల వరకు మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి సెక్షన్ 80(డి)లో విద్యారుణానికి సంబంధించిన సెక్షన్ 80ఈ ప్రకారం మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది.






