మార్చి నెలలో ప్రధాన రంగాల వృద్ధి 5.2%

by Disha Web Desk 17 |
మార్చి నెలలో ప్రధాన రంగాల వృద్ధి 5.2%
X

బిజినెస్ బ్యూరో: భారత్‌లో మార్చి నెలలో ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధి 5.2 శాతంగా నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇది ఫిబ్రవరిలో 7.1 శాతం నుండి తగ్గడం గమనార్హం. అదే ఏడాది ప్రాతిపదికన బొగ్గు, ముడి చమురు, ఉక్కు, సిమెంట్, విద్యుత్, ఎరువులు, రిఫైనరీ ఉత్పత్తులు, సహజ వాయువులతో కూడిన ఎనిమిది ప్రధాన రంగాల ఉత్పత్తి 2022-23లో 7.8 శాతం నుంచి 2023-24లో 7.5 శాతానికి చేరింది. ఉక్కు ఉత్పత్తి ఫిబ్రవరిలో 9.1 శాతం నుంచి మార్చిలో 5.5 శాతం తగ్గింది. అలాగే, బొగ్గు ఉత్పత్తి 11.6 శాతం నుంచి 8.7 శాతానికి, సహజ వాయువు 11.3 శాతం నుండి 6.3 శాతానికి తగ్గింది, ఫిబ్రవరిలో 9.1 శాతంగా ఉన్న సిమెంట్ ఉత్పత్తి 10.6 శాతం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి ఫిబ్రవరిలో 7.5 శాతం నుంచి 8.0 శాతం పెరగ్గా, రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి ఫిబ్రవరిలో 2.6 శాతం వృద్ధితో పోలిస్తే 0.3 శాతం తగ్గింది. ఎనిమిది ప్రధాన రంగాలు దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)కి 40.27 శాతం వాటా అందిస్తున్నాయి. మార్చిలో కోర్ సెక్టార్ అవుట్‌పుట్ నెమ్మదిగా పెరగడం వలన ఐఐపీ సూచిక ప్రకారం, ఎనిమిది ప్రధాన పరిశ్రమల పారిశ్రామిక వృద్ధి కూడా తగ్గవచ్చని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Next Story