అనిల్ అంబానీకి భారీ ఊరట.. కోర్టు కీలక ఆదేశాలు

by Disha Web Desk 17 |
అనిల్ అంబానీకి భారీ ఊరట.. కోర్టు కీలక ఆదేశాలు
X

ముంబై: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. రూ. 420 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి నవంబర్ 17 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖకు కోర్టు ఆదేశాలిచ్చింది.

స్విస్ బ్యాంక్ అకౌంట్లలోని రూ. 814 కోట్ల వరకు అప్రకటిత నిధులకు సంబంధించి రూ. 420 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని బ్లాక్ మనీ చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ విచారించింది. ఆగష్టులో ఐటీ శాఖ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేయగా, ఉద్దేశపూర్వకంగానే విదేశీ బ్యాంకు అకౌంట్లలో ఉన్న మొత్తానికి సంబంధించి వివరాలను వెల్లడించలేదని తెలిపింది.

బ్లాక్ మనీ చట్టం-2015 ప్రకారం బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తుల వివరాల గురించి వివరించాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అనిల్ అంబానీ బాంబే హైకోర్టుకు వెళ్లగా, బ్లాక్ మనీ చట్టం 2015 లో వచ్చిందని, ఈ వ్యవహారానికి సంబంధించినవి 2006-07, 2010-11 ఆర్థిక సంవత్సరాల్లో జరిగినవి కాబట్టి దీనికి ఈ చట్టం వర్తించదని అనిల్ అంబానీ తరపు న్యాయవాది కోర్టులో వినిపించారు.

దీనిపై స్పందించడానికి గడువు కావాలని ఐటీ శాఖ తరపు న్యాయవాది కోర్టును కోరగా, తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని కోర్టు సూచించింది.


Next Story

Most Viewed