- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IMF: భారత వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్
దేశ ఆర్థికవ్యవస్థ బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగిస్తోందని, అమెరికా అధిక టారిఫ్ ప్రభావాన్ని భర్తీ చేయవచ్చని అభిప్రాయపడింది

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వృద్ధి అంచనాలను స్వల్పంగా పెంచుతూ అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వెల్లడించింది. మంగళవారం విడుదల ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ అంచనాలను 0.2 శాతం పెంచి 6.6 శాతంగా నమోదవుతుందని తెలిపింది. దేశ ఆర్థికవ్యవస్థ బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగిస్తోందని, దీని ద్వారా అమెరికా విధించిన అధిక టారిఫ్ ప్రభావాన్ని భర్తీ చేయవచ్చని అభిప్రాయపడింది. అంతేకాకుండా దేశీయ వినియోగం మెరుగ్గా ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగేందుకు దోహదపడుతుంది. అలాగే, దేశీయ సేవల ఎగుమతులు, ముఖ్యంగా ఐటీ, వ్యాపార సేవలు కూడా బలంగా ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక బలాన్ని పెంచుతుందని ఐఎంఎఫ్ వివరించింది. మరోవైపు, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం కూడా కలిసి రానుంది.
ప్రైవేట్ వినియోగం పటిష్టంగా ఉండటంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ ఊహించని విధంగా 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించిన 50 శాతం సుంకాల కారణంగా ఎగుమతులు బలహీనపడ్డాయి. అయినప్పటికీ దేశ జీడీపీ వృద్ధి వేగంగా ఉండటంతో భారత్ అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇదే నివేదికలో, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మాత్రం వృద్ధి అంచాలను ఐఎంఎఫ్ తగ్గించింది. అమెరికా విధించిన అధిక టారిఫ్ ప్రభావం వల్ల 2026-27లో భారత జీడీపీ 20 బేసిస్ పాయింట్లు క్షీణించి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని వెల్లడించింది.






