Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? డోంట్ వర్రీ..సింపుల్ గా ఇలా చేసేయండి..!

by Vennela |   (  Updated:2025-05-25 12:27:34  IST  )

Aadhaar Card: మీ ఆధార్ కార్డు మిస్ అయ్యిందా. డోంట్ వర్రీ.

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? డోంట్ వర్రీ..సింపుల్ గా ఇలా చేసేయండి..!
X

దిశ, వెబ్ డెస్క్: Aadhaar Card: మీ ఆధార్ కార్డు మిస్ అయ్యిందా. డోంట్ వర్రీ. మీరు సులభంగా డూప్లికేట్ ఆధార్ కార్డును తీసుకోవచ్చు. మీరు UIDAI వెబ్ సైట్ ద్వారా వారి హెల్ప్ లైన్ కు కాల్ చేసి లేదా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సూచించిన దశలను అనుసరించి మీ డూప్లికేట్ ఆధార్ కార్డును పొందవచ్చు. మీ అసలు కార్డు పోయినా లేదా నిరుపయోగంగా ఉన్నా UIDAI ఆధార్ కార్డును పొందడానికి అనువైన మార్గాన్ని అందిస్తుంది. ఈ మార్గదర్శకంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్దతుల ద్వారా డూప్లికేట్ ఆధార్ కార్డును పొందే విధానం తెలుసుకుందాం.

మీరు ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా మీ ఆధార్ డూప్లికేట్ కాపీని తీసుకోవచ్చు. ఏదైనా ఆధార్ రిజిస్ట్రేషన్, అప్ డేట్ కేంద్రానికి వెళ్లి మీ పేరు, లింగం, జిల్లా లేదా పిన్ కోడ్ వంటి వివరాలను అందించాలి. ఆ తర్వాత మీ బయోమెట్రిక్ గుర్తింపు తీసుకుంటారు. వివరాలను సరిపోలిన తర్వాత ఆపరేటర్ మీ ఇ ఆధార్ లేఖను ప్రింట్ చేస్తారు. రూ. 30 ఫీజులు తీసుకుంటారు.

మరో ఆప్షన్ ఎంటటే 1947నెంబర్ కు కాల్ చేయడం. ఈ నెంబర్ కు కాల్ చేసి..మీ జనాభా సమాచారాన్ని అందించి ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడండి. వివరాలు సరిపోలితే..ఎగ్జిక్యూటివ్ మీ ఈఐడీ మీకు అందిస్తారు. మళ్లీ 1947 కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ వ్యవస్థను ఉపయోగించండి. అభ్యర్థన స్టేటస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఈఐడీ, పుట్టిన తేదీ, పిన్ కోడ్ నమోదు చేయాలి. వివరాలు సరిపోలితే మీ ఆధార్ నెంబర్ మీకు అందిస్తారు. ఈ సర్వీస్ ఫ్రీ.

ఆన్ లైన్ లో డూప్లికేట్ ఆధార్ కార్డు పొందాలంటే UIDAI అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ఆధార్ సేవలు విభాగంలో లాస్ట్ యూఐడీ, ఈఐడీని తిరిగి పొందండి అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. లాస్ట్ యూఐడీ లేదా ఈఐడీని తిరిగి పొందండి. పేజీలో మీ అవసరానికి అనుగుణంగా ఎంపికను సెలక్ట్ చేసుకోండి. మీ పూర్తిపేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ అడ్రెస్, సేఫ్టీ కోడ్ వంటి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.

మీ వివరాలన్ని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెబ్ పేజీలో ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి సబ్‌మిట్ పై క్లిక్ చేయండి. ఓటీపీ ధ్రువీకరణ తర్వాత మీ ఆధార్ నెంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ కు వస్తుంది. తర్వాత UIDAI పోర్టల్ ను సందర్శించి దాని ప్రింట్ తీసుకుంటే డూప్లికేట్ ఆధార్ కార్డును తీసుకోవచ్చు.

Next Story