- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కనీస ఖాతా నిల్వలపై ICICI యూ టర్న్
ప్రయివేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ(ICICI) కనీస ఖాతా నిల్వలపై యూ టర్న్ తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రయివేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ(ICICI) కనీస ఖాతా నిల్వలపై యూ టర్న్ తీసుకుంది. ఐసీఐసీఐ ఇటీవల కనీస నిల్వలు రూ.50 వేలు ఉండాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు రాగా, తాజగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. కనీస నిల్వల మొత్తాన్ని సవరించింది. ప్రస్తుతం మెట్రో/అర్బన్ ప్రాంతాల్లో రూ.15 వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటిలాగే రూ.2,500 నెలవారీ కనీస నిల్వలు ఉండాలని ఉత్తర్వులు విడుదల చేసింది.
అయితే అంతకముందు అర్బన్ ప్రాంతాల్లో కనీస నిల్వ ఖాతాల్లో రూ. 10 వేలు ఉండగా.. దానిని రూ.50 వేలకు, సెమీ అర్బన్ ఏరియాల్లో రూ.5 వేల నుంచి రూ. 25 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2500 నుచి రూ.10 వేలకు పెంచడంతో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వెనుకడుగు వేయక తప్పలేదు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కనీస నిల్వ నిబంధనను ఎత్తివేయగా.. ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ కొత్త నిబంధన 2025 ఆగస్టు 1 తరవాత ఖాతాలు తెరిచినా వారికి మాత్రమే వర్తిస్తాయని తెలిపింది.






