Hyundai Motor India: హ్యుండాయ్ కార్లు మరింత ఖరీదు

by S Gopi |

ఎంచుకున్న మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Hyundai Motor India: హ్యుండాయ్ కార్లు మరింత ఖరీదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి తమ కార్ల ధరలను గరిష్టంగా రూ. 12,800 వరకు పెంచనున్నట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఎంచుకున్న మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. పెరుగుతున్న తయారీ ఖర్చులు, ముడిసరుకుల ధరల పెరుగుదల, అధిక నిర్వహణ వ్యయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు కంపెనీ అంతర్గతంగా ఖర్చులను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పెరిగిన వ్యయాల్లో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయడం తప్పనిసరి అయిందని హ్యూండాయ్ వెల్లడించింది. మరోవైపు, దేశీయ ఆటో మార్కెట్‌లో ధరల పెంపు మొదలైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మారుతీ సుజుకి కూడా జూన్ నుంచి తమ కార్ల ధరలను రూ. 30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ధరలను సవరించే ఆటో సంస్థలు, ఇప్పుడు నెలల వ్యవధిలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story