భారీగా ICICI బ్యాంక్ షేర్ల పతనం.. తీవ్ర ఆందోళనలో ఇన్వెస్టర్లు!

by Kema Shiva Kumar |

ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర వరుసగా ఐదవ రోజు క్షీణించి రూ.1,329.6 వద్ద ముగిసింది. భారీ ట్రేడింగ్ వాల్యూమ్ నమోదైనప్పటికీ, ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన ఈ స్టాక్ ప్రస్తుతం 'బేరిష్' ట్రెండ్‌లో కొనసాగుతోంది.

భారీగా ICICI బ్యాంక్ షేర్ల పతనం.. తీవ్ర ఆందోళనలో ఇన్వెస్టర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank Ltd) షేర్లు మార్కెట్లో వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. ఇవాళ ట్రేడింగ్‌లో ఈ షేరు భారీ ఎత్తున లావాదేవీలు జరిపినప్పటికీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కారణంగా ధర మరింత క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర నేడు 2.31 శాతం తగ్గి రూ.1,329.6 వద్ద ముగిసింది. గత ఐదు రోజులుగా ఈ స్టాక్ నిరంతరంగా నష్టపోతూ మొత్తంగా 5.48 శాతం మేర పతనమైంది. అయితే, షేరు ధర తగ్గుతున్నప్పటికీ మార్కెట్లో భారీగా ట్రేడింగ్ జరిగింది. సుమారు 65.7 లక్షల షేర్లు చేతులు మారగా, వీటి విలువ దాదాపు రూ.873.38 కోట్లుగా నమోదైంది.

ప్రస్తుతం ఐసీఐసీఐ షేరు 200 రోజుల మూవింగ్ యావరేజ్ (Moving Averages) కంటే తక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది స్టాక్ మార్కెట్ భాషలో చెప్పలంటే ‘బేరిష్’ (Bearish) ట్రెండ్‌ను సూచిస్తోంది. అంటే మరికొంత కాలం ఈ షేర్ వాల్యూ మరింత తగ్గే తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగం, సెన్సెక్స్ (Sensex) సూచీలతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ షేరు పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇతర ప్రైవేట్ బ్యాంకుల కంటే ఈ స్టాక్ ఎక్కువగా నష్టపోవడం గమనార్హం.

ఇక మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. పుట్ ఆప్షన్ (Put Option) ట్రేడింగ్ పెరగడంతో పాటు డెలివరీ వాల్యూమ్స్ తగ్గడంతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో ఐసీఐసీఐ షేరు బలపడి స్థిరపడుతుందా.. పతనం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే మరి.

Next Story