ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్‌పై ఆనంద్ మహీంద్రా షికారు.. సింగిల్ చార్జింగ్‌తో 45 కి.మీ.

by Disha Web Desk 17 |
ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్‌పై ఆనంద్ మహీంద్రా షికారు.. సింగిల్ చార్జింగ్‌తో 45 కి.మీ.
X

దిశ, వెబ్‌డెస్క్: మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఒక ఎలక్ట్రిక్ సైకిల్‌పై షికారు చేశారు. ఇది ఫోల్డబుల్ ఇ-బైక్. మడతబెట్టడానికి ఈజీగా ఉండటంతో పాటు క్యారీ చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌‌ను డ్రైవ్ చేస్తున్న ఫొటోలను ఆయన X లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ గురించి చాలా మంది ఆసక్తిగా నెట్‌లో వెతుకుతున్నారు. ఈ ఇ-బైక్ పేరు ‘హార్న్‌బ్యాక్ X1’. దీన్ని IIT బాంబే విద్యార్థులు తయారు చేశారు. దీని ధర రూ.44,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు సమయంలో మూడు నెలల నో-కాస్ట్ EMI రూ. 14,999 సదుపాయం కూడా ఉంది.

ఇది ఒక్క చార్జింగ్‌తో 45 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇ-బైక్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ జాయింట్‌లతో కూడిన హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది. దీనిలో 6V, 7.65Ah బ్యాటరీని అమర్చారు. ఇది బయటకు తీయడానికి సులువుగా ఉంటుంది. కేవలం నాలుగు గంటల్లో పూర్తి చార్జింగ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీని దమ్ము, ధూళి, వాటర్ నుంచి రక్షించడానికి IP65 రేటింగ్‌ను అందించారు.





Next Story

Most Viewed