త్వరలో ఇండియాలో విడుదల కానున్న Honda CB300R

by Harish |
త్వరలో ఇండియాలో విడుదల కానున్న Honda CB300R
X

దిశ, వెబ్‌డెస్క్: హోండా మోటార్ సైకిల్స్ నుంచి కొత్తగా ఒక బైక్ ప్రపంచ మార్కెట్లో విడుదల అయింది. ఈ మోడల్ పేరు 2024 CB300R. ప్రస్తుతం అమెరికాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అక్కడ దీని ధర $5,149 (దాదాపు రూ. 4.22 లక్షలు). భారత్‌లో త్వరలో విడుదల కానుంది. ఇది రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అవి మ్యాట్ బ్లాక్ మెటాలిక్, పెర్ల్ డస్క్ ఎల్లో. ఈ బైక్ 286cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటార్‌ను కలిగి ఉంది. 30.7PS, 27.5Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ముందు LED లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనో-షాక్, పెటల్-టైప్ డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ABS మొదలగు ఆప్షన్స్ ఉన్నాయి.

Next Story

Most Viewed