- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రయ్.. రయ్.. దూసుకెళ్లడం బానే ఉంటది కానీ.. అంటూ తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: బైక్ రైడర్లు కొంత మంది అదేదో ట్రెండ్ అన్నట్లుగా ఓవర్ స్పీడ్‌తో వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలతో సైతం చెలగాటం అడుతుంటారు. ఓవర్ స్పీడ్‌పై తెలంగాణ పోలీసులు తాజాగా ట్విట్టర్ వేదికగా వైరల్ వీడియోను షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా ఓవర్ స్పీడ్ వల్ల జరిగే అనర్ధంపై ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను తెలంగాణ పోలీస్ ట్వీట్ చేసింది.
యువతీ, యువకులకు బైకులపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లడం బానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ రయ్ మనే సౌండ్ కిక్కు వెనకాల మీ కుటుంబ సభ్యుల పిలుపులు, బాధ్యతలు దాగుంటాయని మరవకండని సూచించింది. వేగం తాత్కాలిక జోష్‌ను ఇస్తుంది.. కానీ ప్రమాదం శాశ్వత విషాదాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఆ ప్రమాదం మీకు చెప్పి రాదు. ఆలోచించండి.. అంటూ హితువు పలికింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ఏరియా, పట్టణ ప్రాంతాల్లోని గల్లీలో ఈ మధ్య విపరీత వేగంగా వెళ్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.