రూ.80 వేలకే కొత్తగా Honda Activa లిమిటెడ్ ఎడిషన్!

by Disha Web Desk 17 |
రూ.80 వేలకే కొత్తగా Honda Activa లిమిటెడ్ ఎడిషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న హోండా యాక్టివ్ వేరియంట్‌లో కొత్త మోడల్ విడుదల అయింది. దీని పేరు ‘హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్’. ప్రారంభ ధర రూ.80,734 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి DLX, Smart(ఈ మోడల్ ధర రూ.82,734 ). ఈ హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్, మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పర్ల్ సైరన్ బ్లూ అనే కలర్స్‌లో కొనుగోలుకు లభిస్తుంది. కొద్ది రోజులు మాత్రమే ఈ బైక్‌ను అమ్మకానికి ఉంచుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.


యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ 109.51cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో 7.7 bhp పవర్, 8.90 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనో-షాక్‌తో సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇది 10-సంవత్సరాల వారంటీతో వచ్చింది. దీనిలో 3 సంవత్సరాలు ప్రామాణికంగా, మిగతా 7-సంవత్సరాలు ఐచ్ఛికంగా ఉంటుంది. CBS బ్రేకంగ్ సిస్టం, ట్యూబ్‌లెస్ టైర్లు, ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు, స్పీడో మీటర్, ట్రిప్ మీటర్, LED హెడ్‌లైట్, క్లాక్ మొదలగు ఆప్షన్స్‌ను దీనిలో అందించారు.

ఇవి కూడా చదవండి : మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త మోడల్.. ధర తెలిస్తే షాక్..

Next Story

Most Viewed