Hero Motocorp: హీరో మోటోకార్ప్‌కు రూ. 456 కోట్ల జీఎస్టీ అథారిటీ పన్ను నోటీసులు

by S Gopi |

ఈ మేరకు నోటీసులు అందినట్టు హీరో మోటోకార్ప్ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

Hero Motocorp: హీరో మోటోకార్ప్‌కు రూ. 456 కోట్ల జీఎస్టీ అథారిటీ పన్ను నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ భారీ మొత్తం రూ. 456 కోట్ల భారీ జీఎస్టీ డిమాండ్ నోటీసులను అందుకుంది. కేంద్ర జీఎస్టీ చట్టం, 2017లోని నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ నోటీసులు ఇచ్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2017, జూలై నుంచి 2021, మార్చి మధ్యకాలంలో కంపెనీ సరఫరా చేసిన విడిభాగాలు, ఇతర పరికరాలపై పన్ను రేట్లలో వ్యత్యాసం ఉన్నట్టు అధికారులు గుర్తించారని, ఈ వ్యవహారానికి సంబంధించి సమీక్షించిన కాలంలో చెల్లించాల్సిన జీఎస్టీతో పాటు దానిపై వడ్డీ కలిపి రూ. 456.06 కోట్లు, రూ. 8.5 కోట్ల పెనాల్టీని కూడా చెల్లించాలని రాజస్థాన్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అదనపు కమీషనర్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నోటీసులు అందినట్టు హీరో మోటోకార్ప్ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. జీఎస్టీ అథారిటీ నుంచి అందిన నోటీసుల కారణంగా కంపెనీ ఆర్థిక, సాధారణ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. కాగా, హీరో మోటోకార్ప్‌కు జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసులు అందాయనే వార్తల నేపథ్యంలో మంగళవారం కంపెనీ షేర్ ధర 1 శాతానికి పైగా పడిపోయి రూ. 4,237.10 వద్దకు చేరింది.

Next Story