- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banks: వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ
దీనివల్ల రుణగ్రహీతలకు ఇళ్ల రుణాలపై కొంత ఉపశమనం లభిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటులో కోత విధించిన నేపథ్యంలో బ్యాంకులు ఈ మేరకు ప్రయోజనాలను ఖాతాదారులకు బదిలీ చేస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) వడ్డీ రేట్లను సవరించాయి. దీనివల్ల రుణగ్రహీతలకు ఇళ్ల రుణాలపై కొంత ఉపశమనం లభిస్తుంది. గత శుక్రవార ఆర్‌బీఐ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50 శాతం నుంచి 5.25 శాతానికి చేర్చింది. బ్యాంకులు తమ ఆర్ఎల్ఎల్ఆర్, ఆర్‌బీఎల్ఆర్, ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించడంతో చాలా మంది కస్టమర్లకు ఈఎంఐ భారం తగ్గనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ బెంచ్‌మార్క్‌తో అనుసంధానం ఉన్న రుణాలపై వడ్డీ దిగివస్తుంది. సవరించిన తర్వాత బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేట్లు కాలవ్యవధిని బట్టి 8.30 శాతం నుంచి 8.55 శాతానికి చేరాయి. ఇదివరకు ఈ రేట్లు 8.35-8.60 శాతం మధ్య ఉండేది. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకు సైతం తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించింది.






