- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Construction: సిమెంట్, స్టీల్‌పై జీఎస్టీ తగ్గింపుతో దిగిరానున్న ఇంటి నిర్మాణ ఖర్చులు
డెవలపర్లు నిధుల లభ్యత, మార్జిన్ల పరంగా భారీ ఉపశమనం పొందుతారని అనరాక్ రీసెర్చ్ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: సిమెంట్, స్టీల్ సహా ఇతర వస్తువులపై జీఎస్టీ తగ్గించాలన్న కౌన్సిల్ నిర్ణయాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్లు స్వాగతించారు. ఇది గృహ కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సిమెంట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల నిర్మాణ ఖర్చులు నేరుగా తగ్గుతాయని, గృహనిర్మాణాలు మరింత సరసమైనవిగా మారుతాయని భావిస్తున్నారు. ప్రధానంగా సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రిపై జీఎస్టీని తగ్గించడం వల్ల నిర్మాణ ఖర్చులు 3-5 శాతం వరకు తగ్గుతాయి. డెవలపర్లు, ముఖ్యంగా సరసమైన గృహాల నిర్మాణంలో ఉన్నవారు, నిధుల లభ్యత, మార్జిన్ల పరంగా భారీ ఉపశమనం పొందుతారని అనరాక్ రీసెర్చ్ తెలిపింది. అనరాక్ ప్రకారం, సరసమైన ఇళ్ల విభాగం (రూ. 40 లక్షల కంటే తక్కువ) మొత్తం ఇళ్ల అమ్మకాలలో 2019లో 38 శాతం నుంచి 2024లో 18 శాతానికి తగ్గింది. ఇలాంటి సమయంలో తగ్గిన పన్ను ప్రయోజనాలను బదిలీ చేస్తే ఈ విభాగంలో డిమాండ్ ఊపందుకుంటుందని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి అన్నారు.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో దాదాపు కోటి బడ్జెట్ ఇళ్ల కొరత ఉంది. ఇది 2030 నాటికి 2.5 కోట్లకు పెరగవచ్చు. తాజా జీఎస్టీ సంస్కరణలు నిర్మాణ ఖర్చులను తగ్గించడమే కాకుండా విధాన పరమైన సంక్లిష్టతలను కూడా తగ్గిస్తాయి. సిమెంట్, స్టీల్ లాంటి కీలకమైన నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల ఇన్‌పుట్ ఖర్చుల భారం తగ్గుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణాలు లాభదాయకతను పెంచేందుకు దోహదపడతాయి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తుందని నారెడ్కో ఛైర్మన్ నిరంజన్ హీరానందాని అన్నారు.






