300 గ్యాంబ్లింగ్ సైట్‌లు, యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం

by S Gopi |

అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లు, యాప్‌లను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది.

300 గ్యాంబ్లింగ్ సైట్‌లు, యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా దేశంలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లు, యాప్‌లను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. వీటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఆన్‌లైన్ క్యాసినో, బెట్టింగ్ ఎక్స్ఛేంజ్‌లు ఉన్నాయి. అలాగే డబ్బు వెచ్చించి ఆడే కార్డ్ గేమ్ యాప్‌లు, మట్కా నెట్‌వర్క్‌లు ఉన్నాయని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు కేంద్రం బ్లాక్ చేసిన వాటి సంఖ్య 8,400కి చేరింది. గతేడాది కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 2025ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2025, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం కింద రమ్మీ, ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్ లాంటి గేమ్‌లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలను విధిస్తోంది. అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను నియంత్రించేందుకు ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Next Story