- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Exports: ఎగుమతుల కోసం విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించిన ప్రభుత్వం
ఈ మార్పుతో ఎగుమతుల విషయంలో నిబంధనలను సులభతరం చేయాలని అమెజాన్ చేస్తున్న లాబీయింగ్ ఫలించినట్టు అయింది.

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ పెట్టుబడుల నిబంధనలను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం కీలక ప్రతిపాదనను రూపొందించింది. దీనివల్ల అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు భారతీయ అమ్మకందారుల నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఆపై వాటిని విదేశీ కస్టమర్లకు విక్రయించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు దేశీయంగా లేదా విదేశాలలో వినియోగదారులకు నేరుగా వస్తువులను అమ్మకుండా నిషేధం ఉంది. తద్వారా ఆయా కంపెనీలు కొనుగోలుదారులు, అమ్మకందారులకు మధ్య అనుసంధానంగా మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ మార్పుతో గత కొంతకాలంగా ఎగుమతుల విషయంలో నిబంధనలను సులభతరం చేయాలని అమెజాన్ చేస్తున్న లాబీయింగ్ ఫలించినట్టు అయింది. తాజా ప్రతిపాదన ఎగుమతులకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు అమెజాన్ దేశీయ సెల్లర్ల నుంచి నేరుగా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఎగుమతి, కస్టమ్స్, డాక్యుమెంటేషన్ మొదలైన వాటిని ప్రత్యేక ఎగుమతి సంస్థల ద్వారా చూసుకోవచ్చు. అయితే, ఈ కంపెనీలు దేశీయ వినియోగదారులకు విక్రయించడానికి, చిన్న స్థానిక రిటైలర్లను రక్షించడానికి అదే ఇన్వెంటరీ మోడల్‌ను ఉపయోగించడానికి వీలుండదు. ఏ కంపెనీ అయినా నిబంధనలు దుర్వినియోగం చేస్తే, అందుకు జరిమానాలు కూడా ఉంటాయి.






