- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indirect Tax: అంచనాలను మించి పరోక్ష పన్ను వసూళ్లు
ఈ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ. 15.52 లక్షల కోట్ల పరోక్ష పన్నుల ఆదాయం పొందాలని భావించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించి పరోక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ. 15.52 లక్షల కోట్ల పరోక్ష పన్నుల ఆదాయం పొందాలని భావించింది. ఈ మేరకు కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీతో సహా సవరించిన అంచనాలను రూ. 15.52 లక్షల కోట్లు దాటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవంలో ఎంత మొత్తం వసూళ్లు జరిగాయనే గణాంకాలను అధికారులు వెల్లడించనప్పటికీ, మొత్తం సవరించిన అంచనాల్లో కస్టమ్స్ డ్యూటీ అనుకున్న దాని కంటే 102 శాతం, ఎక్సైజ్ డ్యూటీ 101 శాతం, సీజీఎస్టీ 100.8 శాతం వసూలయ్యాయని తెలిపారు. మొత్తంగా జీఎస్టీ, ఇతర పన్నులు కలుపుకుని 101.2 శాతం వసూళ్లు జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, పాన్ మసాలా తయారీపై విధించే 'ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్' వసూళ్లు మాత్రం లక్ష్యానికి అనుగుణంగా చేరుకోలేకపోయాయి.ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ప్రత్యేక సెస్సును విధించగా, రూ. 2,330 కోట్లు వస్తాయని భావించారు. కానీ, ఇందులో 63 శాతమే వచ్చినట్టు వెల్లడించారు.






