ఈవీలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

by Dishanational1 |
ఈవీలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ. 500 కోట్లతో దేశీయంగా టూ-వీలర్, త్రీ-వీలర్ల కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024 పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నాలుగు నెలల పాటు ఈ పథకం ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండే బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ-మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం 2024, జూలై వరకు ఉంటుందని, పథకంలో భాగంగా ప్రతి టూ-వీలర్‌కు రూ. 10,000 సబ్సిడీ అందుతుందని, సుమారు 3.3 లక్షల టూ-వీలర్ ఈవీలకు మద్దతివ్వాలనే లక్ష్యంతో ఉన్నట్టు మంత్రి వివరించారు. అలాగే, త్రీ-వీలర్ల(ఈ-రిక్షా, ఈ-కార్ట్‌లు) కొనుగోళ్లపై రూ. 25,000తో 31 వేల వాహనాలకు ఇవ్వాలని నిర్ణయించాం. పెద్ద ఈవీ త్రీ-వీలర్ వాహనాల కొనుగోలుపై రూ. 50,000 ఆర్థిక సహాయం అందించబడుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఈవీల ప్రోత్సాహానికి ఉద్దేశించిన ఫేమ్2 పథకం ఈ నెల 31న ముగియనున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed