తగ్గిన భారతదేశ ప్లాస్టిక్ ఎగుమతులు

by Disha Web Desk 17 |
తగ్గిన భారతదేశ ప్లాస్టిక్ ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వలన భారతదేశ ప్లాస్టిక్ ఎగుమతులు క్షీణించాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశ ప్లాస్టిక్ ఎగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో $11.96 బిలియన్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 3.5 శాతం తగ్గి $11.55 బిలియన్లకు పడిపోయాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, నిర్బంధ వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎగుమతులు తగ్గినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఒక్క 2024 మార్చి నెలలో ఎగుమతుల వృద్ధి గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 5.6 శాతం పెరిగింది.

ముఖ్యంగా ఫిల్మ్‌లు, షీట్‌లు, FIBC (ఫ్లెక్సిబుల్ ఇంటర్మీడియట్ బల్క్ కంటైనర్), నేసిన సాక్స్, నేసిన బట్టలు, టార్పాలిన్ వంటి చాలా ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఫ్లోర్‌కవరింగ్‌లు, లెదర్‌క్లాత్, ప్లాస్టిక్ పైపులు అండ్ ఫిట్టింగ్‌లు మొదలగు ప్లాస్టిక్ ఉత్పత్తులు అధిక ఎగుమతులను నమోదు చేశాయి. ఇదే సమయంలో గృహోపకరణాల ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని కనబరిచాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ భారతదేశ ప్లాస్టిక్ పరిశ్రమ డిసెంబర్ 2023 నుండి మార్చి 2024 వరకు ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలను చవిచూసిందని ప్లాస్టిక్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీబాష్ దాస్మోహపాత్ర అన్నారు.

Next Story