BREAKING: ఈసీ సంచలన నిర్ణయం.. కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేదం

by Disha Web Desk 19 |
BREAKING: ఈసీ సంచలన నిర్ణయం.. కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేదం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేసీఆర్‌పై నిషేధం విధించింది. 1వ తేదీ రాత్రి 8 గంటల నుండి ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్.. ‘కుక్కల కొడుకులు’ అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈసీ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ కేసీఆర్‌పై 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉండగా కేసీఆర్‌పై ఈసీ 48 గంటల నిషేదం విధించడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More...

ఈసీ 48 గంటల నిషేధంపై స్పందించిన KCR

Next Story