- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: భారత్‌లో ఏఐ-ఆధారిత వర్చువల్ డ్రెస్ ట్రై-ఆన్ ఫీచర్‌ను విడుదల చేసిన గూగుల్
ఇది ఆర్డర్ చేసే ముందు కొనుగోలు చేసే దుస్తులు తమ ఒంటిపై ఎలా కనిపిస్తాయో చూసుకునే వీలు కల్పిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అత్యంత వేగంగా మారుతున్న షాపింగ్ ధోరణికి టెక్నాలజీని జోడిస్తూ టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం వర్చువల్ అప్పారెల్ ట్రై-ఆన్ టూల్‌ను ప్రారంభించింది. ఇది ఆర్డర్ చేసే ముందు కొనుగోలు చేసే దుస్తులు తమ ఒంటిపై ఎలా కనిపిస్తాయో చూసుకునే వీలు కల్పిస్తుంది. ప్రస్తుత ఏడాది పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి టాప్స్, బాటమ్స్, డ్రెస్సులు, జాకెట్లు, షూస్ వంటి ఉత్పత్తులు ఎలా సరిపోతాయే చూసుకునేందుకు ఒకే ఒక ఫోటోను అప్‌లోడ్ చేసి సరిచూసుకోవచ్చని గూగుల్ వివరించింది. ఈ టూల్ గూగుల్ కస్టమ్ ఏఐ ఫ్యాషన్ మోడల్ ద్వారా, వివిధ రకాల బట్టలు, మనుషుల సైజులను అర్థం చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మనుషుల డార్క్ అవుట్‌లైన్‌ను సమీక్షించి దుస్తులు ఎలా ఉంటాయి, మడతలు ఎలా పడతాయి లాంటి అంశాలను విశ్లేషించి, అప్‌లోడ్ చేసిన ఫోటోలో ప్రివ్యూ ఇస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగించడానికి షాపర్స్ గూగుల్‌లో 'ట్రై ఇట్ ఆన్ ' అనే ఐకాన్‌ను క్లిక్ చేయాలని, ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత తమకు నచ్చిన దుస్తులను ఎంచుకుని చూసుకోవచ్చని గూగుల్ పేర్కొంది.






