భారత్‌కు క్షమాపణలు చెప్పిన గూగుల్

by Dishanational1 |
భారత్‌కు క్షమాపణలు చెప్పిన గూగుల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్ జెమిని మోడీ గురించి ఇచ్చిన సమాధానం పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా గూగుల్ భారత ప్రధానికి క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్ నమ్మదగినదే అని పేర్కొంది. ఈ విషయాన్ని సోమవారం కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రధానీ మోడీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు జెమిని ఇచ్చిన సమాధానం పక్షపాతాన్ని చూపినట్టు ఆరోపణలు వచ్చాయి. భారత ప్రధాని మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి అడిగిన ఒకే రకమైన ప్రశ్నకు జెమిని ఏఐ మోడీ గురించి వివాదాస్పద సమాధానం చెప్పి, మిగిలిన ఇద్దరి గురించి ఏమీ చెప్పలేదు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర దీనిపై గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. బదులిచ్చిన గూగుల్ క్షమాపణలు చెప్పి, తమ ప్లాట్‌ఫామ్‌ను నమ్మవచ్చని స్పష్టం చేసిందని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశీయంగా ఏఐ ప్రోడక్ట్స్‌ను విడుదల చేయడానికి ముందుగా అనుమతి తీసుకోవాలని ఇటీవల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నెలకొన్న గందరగోళ్లాన్ని తొలగిస్తూ మంత్రి, ఈ విషయంలో స్టార్టప్‌లకు మినహాయింపు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు బడా టెక్ కంపెనీలకు వర్తిస్తుందని, అలాగే టెస్టింగ్ దశలో ఉన్న వాటికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.


Next Story

Most Viewed