- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరిసిన పసిడి.. వెలవెలబోయిన వెండి
రూపాయి పతనం తర్వాత బంగారం ధరలు షాకిచ్చాయి. బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర పెరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: పసిడి ప్రియులు, కొనుగోలుదారులకు బంగారం ధర షాకిచ్చింది. మంగళవారం ఉదయం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1030 పెరిగి రూ.1,49,290కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.1,36,850కి చేరింది. మున్ముందు పెళ్లిళ్లు చేసుకునే జంటలు బంగారం కొనుగోలు చేయాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితే నెలకొంది. కాగా.. వెండి ధర మాత్రం కాస్త రిలీఫ్ ఇచ్చింది. కిలో వెండిపై రూ.5000 తగ్గింది. ప్రస్తుతం వెండి ధర రూ.2,50,000గా ఉంది.
సాధారణంగా డాలర్ పెరిగితే బంగారం తగ్గాలి, కానీ ఈరోజు (మార్చి 31, 2026) పరిస్థితి వేరుగా ఉంది. నిన్న డాలర్ విలువ 95 రూపాయలకు పైగానే ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ఈరోజు బంగారం ధర తగ్గుతుందని భావించిన వారికి షాక్ తగిలినట్లైంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య) నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను భయపెడుతున్నాయి. ఇటువంటి అస్థిర పరిస్థితుల్లో షేర్లు, కరెన్సీల కంటే బంగారం సురక్షితమైనది (Safe Haven) అని భావిస్తారు. అందుకే డాలర్ పెరిగినా, ప్రపంచవ్యాప్తంగా అందరూ బంగారాన్ని కొనడం వల్ల డిమాండ్ పెరిగి ధర పెరిగింది.






