మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం.. ఊహించని విధంగా పెరిగిన ధరలు

by Kema Shiva Kumar |

బంగారం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,53,000లకు చేరింది.

మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం.. ఊహించని విధంగా పెరిగిన ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం (Gold) కొనాలంటేనే సామాన్యులు హడలిపోయే పరిస్థితిలు మళ్లీ రాబోతున్నాయా అంటే ఔననే సమాధానం వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశీయంగా పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ బిలియన్ మార్కెట్‌ (Hyderabad Billion Market)లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 1,520 పెరిగి రూ.1,53,000 వద్ద కొనసాగుతోంది. ఇక అభరణాల్లో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,400 పెరిగి రూ.1,40,250 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది. ఇవాళ ఒక్కరోజే రూ.5,000 పెరగడంతో కిలో వెండి ధర ఇప్పుడు రూ.2,65,000కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా పెరిగిన డిమాండ్ ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే త్వరలోనే బంగారం ధరలు మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.

Next Story