- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్ళీ దూసుకుపోయిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే?
బంగారం, వెండి ధరలకు మళ్లీ దూసుకుపోయాయి. గురువారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.3 వేలకు పైగా పెరిగి రూ.1,31,500కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,150 కి చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : బంగారం, వెండి ధరలకు మళ్లీ దూసుకుపోయాయి. గురువారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.3 వేలకు పైగా పెరిగి రూ.1,31,500కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,150 కి చేరింది. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.10వేలకు పైగా పెరిగి రూ.1,71,300కు చేరింది. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగియడంతో.. ఆర్థిక కార్యకలాపాలు ఎప్పటిలానే మొదలయ్యాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు మార్గం సుగమం కానున్న నేపథ్యంలో.. బంగారం ధర పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు డాలర్ సూచి వీక్ అవడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోళ్లు ఎప్పటిలానే కొనసాగుతుండడం బంగారం డిమాండ్‌కు కారణమని పేర్కొంటున్నారు. కాగా అంతర్జాతీయంగా మర్కెట్‌లో ఔన్సు గోల్డ్ ధర 4,218 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 54.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది.






