Gold Price: త్వరలోనే లక్ష మార్క్ దాటనున్న బంగారం ధర..ఇప్పుడు కొంటే లాభమేనా? నిపుణులేమంటున్నారు?

by Vennela |   (  Updated:2025-03-05 06:00:02  IST  )

Gold Price: కొంతకాలంగా బంగారం ధరలు(Gold Price) భగ్గుమంటున్నాయి.

Gold Price: త్వరలోనే లక్ష మార్క్ దాటనున్న బంగారం ధర..ఇప్పుడు కొంటే లాభమేనా? నిపుణులేమంటున్నారు?
X

దిశ,వెబ్‌డెస్క్: Gold Price: కొంతకాలంగా బంగారం ధరలు(Gold Price) భగ్గుమంటున్నాయి. సామాన్యులకు కొనలేని స్థాయికి చేరుకున్నాయి. అయితే బంగారం(Gold Rates) ధరలు పెరగడానికి కారణాలెన్నో ఉన్నాయి. అయితే చాలా కాలం తర్వాత శుక్రవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. బంగారం ధరలు భారీగా తగ్గుతాయని చాలా మంది భావించారు. కానీ 2025 మార్చిన 4వ తేదీన గ్లోబల్ ట్రేడ్ వార్(Global trade war) ఆందోళనలు పెరగడంతో బంగారం ధరలు మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 86 వేలు దాటింది. కెనడా(Canada), మెక్సికో(Mexico), చైనా(china)పై టారిఫ్స్ అమల్లోకి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) నిర్ణయించారు. దీంతో పసిడి ధరల(Gold Price)కు మళ్ల రెక్కలొచ్చాయి.

మల్టీ కమెడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా(Multi Commodity Exchange of India) అనేది భారత్ లో సెక్యూరిటీస్ అండ్ కమెడిటీ ఎక్స్చేంజ్ కంపెనీ(Securities and Commodity Exchange Company). దీనిలో బంగారం ధర ఎంసీఎక్స్(mcx) పది గ్రాములకు ఏప్రిల్ 4 కాంట్రాక్ట్ రూ. 85,399దగ్గర ప్రారంభం అయ్యింది. ఇంట్రాడే ట్రేడ్ లో పది గ్రాముల ధర రూ. 86,243 వద్ద గరిష్టానికి చేరుకుంది. ముంబైలోని భారత్ కు చెందిన అతిపెద్ద కమోడిటి డెరివేటివ్ ఎక్స్చేంజ్ లో మధ్యాహ్నం 2.45గంటలకు బంగారం 10 గ్రాముల రూ. 86,100 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఇది ఆల్ టైమ్ హైయస్ట్ ధర రూ. 86,592 కేవలం రూ. 349 కంటే తక్కువ.

అయితే ఈ ఏడాది బంగారం(Gold Price) ధరలు పెరగడానికి కారణాలెన్నో ఉన్నాయి. పలు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. అమెరికా ఇతర కీలక దేశాలపై భారీగా టారిఫ్స్(Tariffs) విధిస్తోంది. ఈ గందరగోళం మధ్య పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ మెంట్స్(investments) ను సురక్షితమైన గోల్డ్ లోకి మళ్లిస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటంతో బంగారంపె ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. సెంట్రల్ బ్యాంకులు(central banks) కూడా బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. బంగారం నిల్వలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2025 ప్రారంభం నుంచి డొమెస్టిక్ గోల్డ్ ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల ధర రూ. 75, 913 నుంచి రూ. 84,828కి చేరింది. అంటే దాదాపు 12శాతానికిపైగా పెరిగాయి.

కెనడా, మెక్సికో దిగుమతులపై అమెరికా 25శాతం టారిఫ్స్(Tariffs) విధించింది. చైనా వస్తువులపై 20శాతం టారిఫ్స్ విధించింది. దీనికి ప్రతిస్పందనగా చైనా మార్చి 10 నుంచి కొన్ని అమెరికా దిగుమతులపై 10 నుంచి 15శాతం ఎడిషనల్ టారిఫ్స్(Tariffs) ప్రకటించింది. కెనడా కూడా 20.7బిలియన్ డాలర్ల విలువైన యునైటెడ్ స్టేట్స్ వస్తువులపై 25శాతం టారిఫ్స్ విధించింది. ట్రేడ్ టెన్షన్స్ ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర ఇంకా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్ కేపీ సెక్యూరిటీస్ లోని వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది ఫైనాన్షియల్ ఫ్లాట్ ఫామ్ మాట్లాడుతూ బంగారం పది గ్రాములకు రూ. 84,500 నుంచి రూ. 86,750 పరిధిలో ట్రేడ్ అవుతుందని అంచనా వేశారు. దీంతో త్వరలోనే బంగారం ధర తులం లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికాకు వ్యతిరేకంగా కెనడా, చైనా కూడా టారిఫ్స్ పెంచాయి. ఈ క్రమంలోనే సెక్యూర్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. పెట్టుబడిదారులు ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్ మెంట్, నాన్ ఫార్మ్ పేరోల్స్, నిరుద్యోగ గణాంకాల సహా కీలకమైన యూఎస్ ఫైనాన్షియల్ డేటాను కూడా పర్యవేక్షిస్తారని తెలిపారు.

Next Story