Gold Prices Today:తగ్గినట్లే తగ్గి చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?

by Jakkula.Mamatha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Gold Prices Today:తగ్గినట్లే తగ్గి చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,280 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.10 పెరిగి రూ. 1,23,290గా ఉంది. అలాగే నిన్న రూ.1,13,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.10 పెరిగి రూ.1,13,010 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.1,64,900గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,23,290

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,13,010

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,23,290

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,13,010

Next Story