- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహించని రీతిలో బంగారం ధర పతనం.. ఒక్కరోజే రూ.10 వేలు డౌన్
ఈ ఒక్కరోజే బంగారం ధర భారీగా పతనమైంది. దీంతో కొనుగోలుదారులు ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పూటపూటకీ బంగారం ధరలు ఊహించని రీతిలో పతనమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధభయాలు, ద్రవ్యోల్బణం, పెట్టుబడులు కొనసాగిస్తే నష్టాలు వస్తాయన్న సమీకరణాల నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పడిపోతున్నాయి. సోమవారం ఉదయం 24 క్యారెట్ల బంగారంపై రూ.5950, 22 క్యారెట్ల బంగారంపై రూ.5450 పతనమవ్వగా.. సాయంత్రం మరోసారి బంగారం ధరలు తగ్గాయి.
సాయంత్రం 4 గంటల తర్వాత 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.4370 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.4000 పతనమైంది. దీంతో ఈ ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం రూ.10,320, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.9450 తగ్గింది. భారీగా బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారులు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,35,650గా ఉండగా.. 22 బంగారం 10 గ్రాముల ధర రూ.1,24,350గా ఉంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్వల్ప తేడాలతో బంగారం ధరలు దాదాపు ఈ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఈ ధరలకు తరుగు, జీఎస్టీ అదనంగా ఉంటుంది.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై తాత్కాలికంగా యుద్ధం ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం బంగారం ధరలపై ఉండే ఛాన్సుందని నిపుణులు చెప్తున్నారు. పెరుగుదల భారీగా ఉండకపోవచ్చు. అలాగే ఒక్కసారిగా పడిపోయే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇరాన్ పై ఆంక్షలు మరింత పెంచినా, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగినా ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు ఇది ఆచితూచి వ్యవహరించాల్సిన సమయమనే చెప్పాలి.






