- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బుధవారం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మళ్లీ సురక్షిత సాధనాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి మొగ్గుచూపింది. దీంతో బుధవారం బంగారం ధర మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రధానంగా ఇరు దేశాల మధ్య 2 వారాల పాటు సీజ్‌ఫైర్‌కు అంగీకారం కుదరడంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు, బంగారం లాంటి విలువైన లోహాలకు అత్యధిక డిమాండ్ పెరిగిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం రూ. 3 వేల కంటే ఎక్కువగా పెరిగి రూ. 1.54 లక్షలకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 3,980 పెరిగి రూ. 1,53,820 వద్ద, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 3,650 పెరిగి రూ. 1.41 లక్షలకు చేరింది. వెండి రూ. 10 వేలు పెరగడంతో కిలో ఇప్పుడు రూ. 2.60 లక్షలుగా ఉంది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 4,738 డాలర్లుగా, ఔన్స్ వెండి 75.30 డాలర్లుగా ఉంది.






