- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్‌లలో భారీ పెట్టుబడులు
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతుండటంతో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి నిధులు వరదలా వచ్చి చేరుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ గోల్డ్ ఈటీఎఫ్‌లలో భారీ పెట్టుబడులు పోగవుతున్నాయి. గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతుండటంతో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి నిధులు వరదలా వచ్చి చేరుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించి గోల్డ్ ఈటీఎఫ్ విభాగంలో ఏకంగా రూ. 24,039.96 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది గతేడాది జనవరిలో వచ్చిన రూ. 11,647 కోట్ల కంటే రెట్టింపు కావడం విశేషం. అంతేకాకుండా ఇదే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చిన రూ. 24,028 కోట్ల కంటే కూడా కూడా ఎక్కువ గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి నిధులు రాడం విశేషం. ఇక, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి జనవరి నెలలో నిధులు 14 శాతం తగ్గి రూ. 24,028 కోట్లు వచ్చాయి. ఇవి వరుసగా రెండో నెలా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న స్తబ్దత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో మదుపు చేసేందుకు జాగ్రత్త పడ్డారు. ఇదే సమయంలో బంగారం ధరలు పుంజుకోవడం వల్లనే గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో మ్యూచువల్ ఫండ్ సంస్థల(ఏఎంసీ) నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 81.01 లక్షల కోట్లకు చేరింది.






