BIG BREAKING: కొనుగోలు దారులకు భారీ శుభవార్త.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-11 12:13:35  IST  )

కొన్ని నెలలుగా ఊహకందని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. నిన్నటికి నిన్న 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా రూ.11000 మేర పెరగ్గా.. శుక్రవారం ఉదయం, సాయంత్రం భారీగా తగ్గింది.

BIG BREAKING: కొనుగోలు దారులకు భారీ శుభవార్త.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని నెలలుగా ఊహకందని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. నిన్నటికి నిన్న 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా రూ.11000 మేర పెరగ్గా.. శుక్రవారం ఉదయం, సాయంత్రం భారీగా తగ్గింది. ఒక్కరోజే తులం బంగారం ధర రూ.11,000 మేర తగ్గింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200కు దిగొచ్చింది. జీఎస్టీతో కలిపి హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,73,000 వరకూ ఉంది. కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పతనమయింది. శుక్రవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.59 వేలు పతనమయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.3,48,000కు తగ్గింది.

బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు సేఫ్ అని భావించి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం, ఈవీ, సోలార్ ప్యానల్స్ లో వెండికి డిమాండ్ పెరగడంతో ఊహకందని రీతిలో పెరిగాయి. రెండ్రోజుల్లో బడ్జెట్ 2026ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనుండగా.. మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాలను తీసుకోవడంతో ఒక్కరోజులోనే రూ.5 లక్షల కోట్ల బంగారం సంపద ఆవిరైంది. బడ్జెట్ తర్వాత వాటి ధరలు తగ్గుతాయన్న ఊహాగానాల నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు లాభాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ భారీ హెచ్చుతగ్గులు కనిపించగా.. కాసేపటికి కోలుకున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు. నేడు కూడా బంగారం, వెండిపై లాభాలను స్వీకరించడంతో ధరలు భారీగా తగ్గినట్లు చెప్తున్నారు. గడిచిన రెండ్రోజుల్లో ఈ లోహాలపై పెట్టుబడులు పెట్టినవారికి ఇది భారీ నష్టాలను మిగిల్చింది.

Next Story