- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి రేటు
పసిడి ప్రియులకు, కొనుగోలు దారులకు, మగువలకు బంగారం ధరలు మరోసారి గట్టి షాకిచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: పసిడి ప్రియులకు, కొనుగోలు దారులకు, మగువలకు బంగారం ధరలు మరోసారి గట్టి షాకిచ్చాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. నేడు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.1910, 22 క్యారెట్ల బంగారం రూ.1750 మేర పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,27,040, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,16,450కి చేరుకున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. మంగళవారం కిలో వెండి ధర ఏకంగా రూ.3000 పెరిగి రూ.1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు దాదాపు ఇవే ధరలు ఉంటాయి.
రేపటి నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకూ పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. అయినప్పటికీ బంగారం ధర పెరుగుతుండటంతో ఇంకెప్పుడు తగ్గుతుంది అని కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్ పెరగడం సాధారణం. ఇప్పుడు సీజన్ లేకపోయినా పెరుగుతుండటంతో బంగారం కొనాలనుకున్నవారు నిరాశ చెందుతున్నారు.






