- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహించని షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. వీటి ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన వారికి ఊహించని షాక్ తగిలినట్లైంది.

దిశ, వెబ్‌డెస్క్: కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు ఊహించని షాకిచ్చాయి. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.3980 పెరిగి రూ.1,53,820కి జంప్ అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3650 పెరిగి రూ.1,41,000కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,65,000కు చేరింది.
ఇరాన్ పై ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గగా.. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. సీజ్ ఫైర్ ప్రకటనతో బంగారం, వెండిపై పెట్టుబడులు పెరగడం, కొనుగోళ్లకు డిమాండ్ ఉండటంతో వీటి ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.






