- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనక్కి తగ్గని బంగారం.. నేడు కొనుగోలుదారులకు భారమే!
బంగారం, వెండి ధరలు కొనుగోలు దారులకు షాకిచ్చాయి. పెద్దమొత్తంగా బంగారం కొనుగోలుచేసేవారికి పెరిగిన ధర భారం కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిళ్లు, శుభకార్యాల ముహూర్తాల సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని ఆనందించే లోగానే ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతవారం భారీగా తగ్గిన ధరలు.. ఈ వారం ఊహించని రీతిలో పెరుగుతూ.. కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. దగ్గరలో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకుని, ఇంకా బంగారం కొనుగోలు చేయని వారికి ఇది అదనపు భారమనే చెప్పాలి. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2510 పెరిగి రూ.1,48,090కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ర.2300 పెరిగి రూ.1,35,750కి ఎగబాకింది. ఇక వెండి విషయానికొస్తే.. నిన్న రూ.10 వేలు తగ్గగా నేడు రూ.5000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 2,50,000కు చేరింది. పెరిగిన ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, లైవ్ ట్రేడింగ్ ను బట్టి బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యే ఛాన్సుంది.






