- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. కారణమిదేనా?
బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయని ఎదురుచూస్తున్న క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రెండింటి ధరలు భారీగా పెరిగాయి.

దిశ, వెబ్‌డెస్క్:గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా పతనమవుతూ, కొనుగోలుదారులలో ఆశలు రేకెత్తించాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు పడిపోతుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో, బుధవారం ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా రూ.3760 పెరిగి రూ.1,46,670కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3450 పెరిగి రూ.1,34,450కి ఎగబాకింది. నేడు బంగారం కొనుగోలు చేసేవారికి ఇది అదనపు భారమనే చెప్పాలి. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండిపై రూ.10,000 పెరగ్గా.. నేటి ధర రూ.2,60,000 గా ఉంది.
ప్రపంచ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరగడం, డాలర్ బలహీనపడటమే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై వస్తున్న తాజా వార్తలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లించాయి. దీనికి తోడు దేశీయంగా వివాహాల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం, రూపాయి మారకం విలువలో మార్పులు కూడా ఈ పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. బంగారం, వెండి ధరల పెరుగుదల తాత్కాలికమేనా లేక రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.






