- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Working Hours: పని గంటల కంటే నాణ్యత ముఖ్యం: ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు శిబులాల్
వారంలో ఎక్కువ గంటలు పనిచేయడం కంటే, చేసే పనిపై ఎక్కువ దృష్టి ఉండాలని అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా ఉద్యోగుల పని గంటల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి వారంలో 70 గంటలు పని చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు ఎస్ డీ శిబులాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐఎంయూఎన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వారంలో ఎక్కువ గంటలు పనిచేయడం కంటే, చేసే పనిపై ఎక్కువ దృష్టి ఉండాలని అభిప్రాయపడ్డారు. వారానికి 70 గంటల పని మూర్తి వ్యాఖ్యలపై స్పందించిన శిబులాల్.. నా దృష్టిలో సమయం కంటే, నాణ్యత ముఖ్యం. చేస్తున్న పని విషయంలో లీనమై ఉండాలి. దృష్టి మరల్చకూడదు. పని చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్, ఇతర ఆలోచనలపై దృష్టి వెళ్లకూడదు. ఒక వ్యక్తి ఏ పని ఎంచుకున్నా, 100 శాతం అందులో లీనమై ఉండాలని, పూర్తి అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. అంతిమంగా వ్యక్తిగత నిర్ణయాలు, సమయపాలన వంటి వివిధ అంశాలకు మనమిచ్చే ప్రాధాన్యతలకు సంబంధించినవని అన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన, ప్రజా జీవితం అనేవి ఉంటాయి, ఈ మూడింటి మధ్య సమయాన్ని విభజించడమే ఒక వ్యక్తి చేయాల్సిన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.






