Mudra Loan Scheme: ఎలాంటి హామీ లేకుండానే రూ. 20లక్షలు..అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం

by Vennela |

Mudra Loan Scheme: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో పథకాలతో జనం లబ్ది పొందుతున్నారు.

Mudra Loan Scheme: ఎలాంటి హామీ లేకుండానే రూ. 20లక్షలు..అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: Mudra Loan Scheme: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో పథకాలతో జనం లబ్ది పొందుతున్నారు. ఇందులోనే వ్యాపారం చేయాలనుకునే వారి కోసం చిన్న, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి హామీ లేకుండా కేంద్ర ప్రభుత్వం రూ. 20లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఇదే ప్రధాన్ మంత్రి ముద్ర యోజన స్కీమ్(Prime Minister's Mudra Yojana Scheme). కిందటిసారి బడ్జెట్(Budget) లో ఈ లిమిట్ ను రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షలకు పెంచింది.

కేంద్ర ప్రభుత్వం 2024 వార్షిక బడ్జెట్లో పీఎం ముద్ర యోజన స్కీమ్(Mudra Yojana Scheme) లిమిట్ ను రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షలకు వరకు చేర్చిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)..బడ్జెట్ సమయంలో ప్రకటన చేయగా..తర్వాత కొద్ది రోజులకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదించింది. దీంతో ఇప్పుడు నాలుగు కేటగిరీల కింద వేర్వేరు మొత్తం లోను వస్తుంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం లోన్లు అందించడమే లక్ష్యంగా చిన్న చిన్న వ్యాపారుల కోసం ఈ స్కీమ్ తీసుకువచ్చింది కేంద్ర. 2015 ఏప్రిల్ 8వ తేదీన ఈ పథకంను లాంచ్ చేసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో నిధులు అందిస్తూ వస్తోంది. గతేడాది ఆ మొత్తాన్ని మరింత పెంచింది.

స్వయం ఉపాధిని మరింత ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ పథకం ప్రారంభం అయ్యింది. ఈ స్కీమ్ కింద వ్యవసాయేతర, కార్పొరేట్ ప్రయోజనాల(Corporate benefits) కోసం లోన్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేసే నిరుద్యోగులు, యువకులు, మహిళలు.తమ వ్యాపారాలను మెరుగుపర్చుకోవాలనుకునే చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా ఈ పథకం కింద లోన్స్ తీసుకునే అవకాశం ఉంది.

అంతకుముందు ఈ స్కీం కింద మూడు రకాల కేటగిరీలు ఉండేవి. ఇప్పుడు అవి నాలుగుకు పెంచింది. శిశులోన్(Child loan) కింద రూ. 50వేల వరకు లోన్ తీసుకోవచ్చు. కిషోర్ లోన్(Kishore Loan) కింద 50వేల నుంచి 5లక్షల వరకు ..తరుణ్ లోన్ కింద 5 నుంచి 10లక్షల వరకు..తరుణ్ ప్లస్ కేటగిరి(Tarun Plus Category) కింద రూ. 20లక్షల వరకు లోన్ అందిస్తోంది. ఈ లోన్ పొందాలంటే తరుణ్ కేటగిరీ కింద లోన్ తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించిన వారికి తరుణ్ ప్లస్ వస్తుంది.

ముద్ర స్కీమ్(Mudra Yojana Scheme) కింద లోన్స్ పొందాలనుకుంటే కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను ఆశ్రయించవచ్చు. ఇక్కడ మీరు ఎందుకోసం లోన్ తీసుకొంటున్నారో చెప్పాల్సి ఉంటుంది. రెగ్యులర్ లోన్స్ కంటే ఇక్కడ కాస్త తక్కువ వడ్డీ రేటుకే లోన్స్ తీసుకోవచ్చు. అయితే ఎలాంటి హామీ లేకుండా లోన్స్ తీసుకోవచ్చు. లోన్ ను ఈఎంఐ(emi)ల్లో చెల్లించాలి. రీపేమెంట్ వ్యవధి 12నెలల నుంచి 5ఏళ్ల వరకు ఉంటుంది. ఎక్కువగా మహిళా వ్యాపారులే ఈ స్కీం కింద లబ్ది పొందుతున్నట్లు గతంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ నుంచే 50శాతానికిపైగా ఉన్నట్లు తెలిపారు. ఈ స్కీములో క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు దేశ ఆర్ధిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 80శాతానికి పైగా శిశు రుణాలే మంజూరు అయ్యాయి.

Next Story