- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST: ఆభరణాలపై జీఎస్టీని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరిన రత్నాభరణాల పరిశ్రమ
నియంత్రణ పరిధిలోకి రాని వ్యాపారాలకు కారణమవుతోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైలో కొనసాగుతున్న నేపథ్యంలో అమ్మకాలు పెంచేందుకు బులియన్, ఆభరణాలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని తగ్గించాలని రత్నాభరణాల పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల పరిశ్రమకు అధిక పన్ను రేట్ల భారం వ్యాపార నిర్వహణను ప్రభావితం చేస్తోంది. నియంత్రణ పరిధిలోకి రాని వ్యాపారాలకు కారణమవుతోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్, సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆభరణాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటును 3 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గించాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రోక్డె ఓ ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ రేటు తగ్గింపు ద్వారా పరిశ్రమ వృద్ధికి మద్దతు లభిస్తుందని ఆయన తెలిపారు. దీనిపై మరింత వివరణ ఇచ్చిన ఆయన.. జీఎస్టీ పన్ను విధాన లక్ష్యమే నిష్పక్షపాత రాబడులను కలిగి ఉండటం. గత పరోక్ష పన్ను విధానాల ఆధారంగా పన్ను రేట్లను సమానంగా అమలు చేయడమని, తద్వారా రత్నాభరణాల పరిశ్రమలో ఆభరణాలపై జీఎస్టీ 1.25 శాతంగా ఉండాలని వివరించారు. జీఎస్టీని తగ్గించడం వల్ల దేశీయ తయారీదారులను ప్రోత్సహించినట్టు అవుతుందని, ఉపాధి పెరుగుతుందని, ఆభరణాల తయారీలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.






