GJEPC: ఏప్రిల్‌లో 5 శాతం క్షీణించిన రత్నాభరణాల ఎగుమతులు

by S Gopi |

2024-25లో భారత రత్నాభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి సుమారు రూ. 2.41 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి

GJEPC: ఏప్రిల్‌లో 5 శాతం క్షీణించిన రత్నాభరణాల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ డిమాండ్ దెబ్బతినడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో 2024-25లో భారత రత్నాభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి సుమారు రూ. 2.41 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు రూ. 2.67 లక్షల కోట్లుగా ఉన్నాయి. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహకాల మండలి(జీజేఈపీసీ) మంగళవారం విడుదల చేసిన డేటాలో నెలవారీగా చూస్తే.. ఏప్రిల్ నెలలో రత్నాభరణాల ఎగుమతులు 4.62 శాతం క్షీణించి రూ. 17,428 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఎగుమతులు రూ. 18,224 కోట్లుగా ఉన్నాయి. చైనాలో గిరాకీ తగ్గడం, భారత్‌కు కీలక మార్కెట్‌గా ఉన్న అమెరికాలోనూ ఇవే పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈ క్షీణత నమోదైంది. ముడి విజ్రాల ధరలలో 10-15 శాతం తగ్గుదల కూడా ఎగుమతులపై ప్రభావం చూపాయని జీజేఈపీసీ ఛైర్మన్ కిరీట్ భన్సాలీ చెప్పారు. కట్ చేసిన వజ్రాల ఎగుమతులు 6.12 శాతం తగ్గి రూ. 9,384 కోట్లు, బంగారు ఆభరణాల ఎగుమతులు 5.41 శాతం క్షీణించి రూ. 5,839 కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్‌లో వెండి ఎగుమతులు 12.03 శాతం తగ్గి రూ. 327 కోట్లుగా నమోదయ్యాయని గణాంకాలు పేర్కొన్నాయి.

Next Story