చిన్న బ్యాంకే కానీ.. మిగతా వాటికంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది!

by Disha Web Desk 17 |
చిన్న బ్యాంకే కానీ.. మిగతా వాటికంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఆర్‌బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాంకులు కూడా వినియోగదారులను ఆకట్టుకోడానికి వరుసగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు దీటుగా పలు ప్రైవేటు బ్యాంకులు అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తూ కస్టమర్లను తమవైపు తిప్పుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రైవేటు బ్యాంకు అందరికంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది. దాని పేరు ‘ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB)’. సోమవారం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లను సవరించింది.

కొత్త వడ్డీ రేట్లు మార్చి 24 నుంచి అమల్లోకి వస్తాయి. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 9.01% వడ్డీ రేటు లభిస్తుంది. అదే సాధారణ ప్రజలకు అయితే 8.41% వడ్డీ రేటును అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలవ్యవధి 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. మిగతా బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ వడ్డీ రేటు. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేవలందిస్తోంది. అలాగే, 32 లక్షల మంది కస్టమర్‌లను కలిగి ఉంది.

Also Read..

వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!


Next Story

Most Viewed