రూ. 70,000కు బంగారం

by Dishanational1 |
రూ. 70,000కు బంగారం
X

న్యూఢిల్లీ: గడిచిన ఏడాది కాలంలో దేశీయంగా బంగారం ధరలు కొత్త గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాల మధ్య 2024లోనూ పసిడి ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రూపాయి విలువ స్థిరంగా ఉండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం కారణాలతో ప్రస్తుతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రూ. 63,870( పది గ్రాముల) వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం రూ. 83.25 వద్ద ఉంది. దీని ప్రకారం ఔన్స్ బంగారం 2,058 డాలర్ల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇదే ధోరణిలో కొనసాగితే పసిడి ధర 2024లో పది గ్రాములు రూ. 70,000కి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ధరలు అస్థిరంగా కొనసాగాయి. ఇటీవల బంగారం ధరలు రూ. 64,250, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ 2,140 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకాయి. రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగినప్పటికీ 2024 చివరి నాటికి బంగారం ధర రూ. 70 వేలకు చేరుకోవచ్చు. దేశంలో ఎన్నికలు ఉండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి నిధులు వెనక్కి తీసుకోవడం వల్ల రూపాయి విలువ బలహీనపడినా విలువైన లోహం ధర మరింత పెరుగుతుందని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అన్నారు.


Next Story