Gold: చైనా చేస్తున్న ఈ పనితో భారీగా పడిపోతున్న బంగారం ధర...పుత్తడి ప్రియులకు ఇక పండగ..!!

by Vennela |

Gold: బంగారం ధరలు భారీగా తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు.

Gold: చైనా చేస్తున్న ఈ పనితో భారీగా పడిపోతున్న బంగారం ధర...పుత్తడి ప్రియులకు ఇక పండగ..!!
X

దిశ, వెబ్ డెస్క్: Gold: బంగారం ధరలు భారీగా తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు ఇప్పటికే ఫ్యూచర్స్ మార్కెట్లో భారీగా తగ్గాయి అమెరికాలో బంగారం ధర ఒక ఔన్స్ 3500 డాలర్ల గరిష్ట స్థాయి నుంచి ఏకంగా ఒక దశలో 3150 డాలర్ల వరకు పడిపోయింది. మనదేశంలో కూడా బంగారం ధర ఒక లక్ష రూపాయల నుంచి దాదాపు 93 వేల రూపాయల వరకు పతనం అయింది.

ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా అమెరికా చైనా మధ్య కుదిరిన ట్రేడ్ ఒప్పందమే కారణమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే చైనా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. గత ఏడాదికాలంగా చైనా ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలో ఉంది.

ఇప్పటికే అక్కడ నిరుద్యోగం భారీగా పెరిగిందని, చైనాలో వస్తువుల ఉత్పత్తి బాగా ఉన్నప్పటికీ దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య తగ్గుతోందని రిపోర్టులు అందుతున్నాయి. గ్వాంగ్డాంగ్, జియాంగ్సు, షాంఘై, షాండాంగ్, జెజియాంగ్ ప్రావిన్షియల్ స్టేట్స్ లో పెద్ద ఎత్తున కార్మికుల నుంచి కూడా నిరసనలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థలలో రిపోర్టు కాకుండా చైనా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా చైనాలో చాలా పరిశ్రమలు మూతపడటంతో పాటు, ఇతర సమస్యల వల్ల చైనా ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే చైనా ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి, తన గోల్డ్ నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చైనా గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తూ వస్తోంది చైనా వద్ద దాదాపు 2000 మెట్రిక్ టన్నుల బంగారం నిలువలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటిలో కొంత భాగం బహిరంగ మార్కెట్లో చైనా విక్రయించినట్లయితే ప్రస్తుతం చైనా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఇదే జరిగినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది అని కూడా అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో చైనా పెద్ద మొత్తంలో బంగారాన్ని విడుదల చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బంగారానికి డిమాండ్ తగ్గుతుందని అప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చైనా ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో యూరప్ దేశాలు ఇలాంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు బంగారం నిల్వలను విక్రయించాయని గుర్తు చేస్తున్నారు.

Next Story