- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EVs: పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ పొడిగించాలని కోరుతున్న ఈవీ టూ-వీలర్ కంపెనీలు
ఈవీ విభాగంలో సబ్సిడీలను కొనసాగించడం వల్ల కొనుగోలుదారులు, ముఖ్యంగా తక్కువ ధరలో కొనాలని భావించే వారికి సహాయపడుతుందని కంపెనీ చెబుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదన చేశాయి. ఈవీ విక్రయాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద అందించే సబ్సిడీలను పొడిగించాలని కోరాయి. ఈ పథకం మార్చితో ముగియనున్న నేపథ్యంలో కంపెనీ ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. ఈవీ విభాగంలో సబ్సిడీలను కొనసాగించడం వల్ల కొనుగోలుదారులు, ముఖ్యంగా తక్కువ ధరలో కొనాలని భావించే వారికి సహాయపడుతుందని కంపెనీ చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీలకు అధిక గిరాకీ ఉన్నప్పటికీ, సబ్సిడీ ఆగిపోవడం వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో పెట్టుబడులపై ఒత్తిడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సబ్సిడీల కారణంగా మొదటిసారి వాహన కొనే చాలామంది పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్‌కే ఎక్కువగా ఎంచుకున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సబ్సిడీలు తొలగిస్తే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఆన్-రోడ్ ధర రూ. 6,000 నుంచి రూ. 12,000 వరకు పెరుగుతాయి. ఈ పెరుగుదల వల్ల కొందరు కస్టమర్లు పెట్రోల్ వాహనాలను కొనేందుకు ఇష్టపడతారని కంపెనీలు వివరించాయి. బ్యాటరీలు, నియంత్రణ ఖర్చులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున తాము ఈ ఖర్చును భరించలేమని చెబుతున్నాయి. ఫ్యాక్టరీలు, డీలర్‌షిప్‌లు, స్థానిక తయారీకి తగినట్టు ఈ ఏడాది పాలసీ పరంగా మద్దతుండాలని కంపెనీ వెల్లడించాయి.






