డిజిలాకర్‌లో EPFO సేవలు.. పీఎఫ్ బాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-23 14:12:59  IST  )

పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ (PF Balance Checking) చేసుకోవాలంటే పీఎఫ్ అకౌంట్ లాగిన్ అయి, మళ్లీ పాస్ బుక్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

డిజిలాకర్‌లో EPFO సేవలు.. పీఎఫ్ బాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ (PF Balance Checking) చేసుకోవాలంటే పీఎఫ్ అకౌంట్ లాగిన్ అయి, మళ్లీ పాస్ బుక్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం లేదు. డిజిలాకర్ యాప్ (Digi Locker APP)లో ఈపీఎఫ్ఓ (EPFO) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని సహాయంతో ఖాతాదారులు ఎక్కడి నుంచైనా సరే.. పీఎఫ్ బ్యాలెన్స్, పాస్ బుక్, ఇతర డాక్యుమెంట్లను యాక్సెస్ చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ సంస్థ ఎక్స్ ద్వారా తెలిపింది.

స్మార్ట్ ఉన్న ప్రతి ఖాతాదారుడు డిజిలాకర్ యాప్ ను డౌన్లోడ్ చేసి.. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, పాస్ బుక్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యూఏఎన్ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, స్కీమ్ సర్టిఫికెట్ వంటివి కూడా ఈ యాప్ ద్వారా పొందే సౌకర్యం ఉంది. ఉమాంగ్ యాప్ మాదిరిగానే ఇకపై డిజిలాకర్లోనూ పాస్ బుక్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చన్నమాట. ఐఓఎస్ యూజర్లకు ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే 9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే ఎస్ఎంఎస్ రూపంలో మీకు వివరాలు వస్తాయి. యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్ కు EPFOHO 'UAN' అని మెసేజ్ చేసినా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Next Story