- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయం 6 గంటలకు ఈ మెయిల్స్: కట్ చేస్తే.. 30 వేల మంది ఉద్యోగాలు మటాష్!
ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఇవాళ తెల్లవారుజామునే ఈమెయిల్స్ పంపింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ (Oracle) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున లేఆఫ్స్‌కు (Layoffs) తెరలేపింది. సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలని సంస్థ నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే సంబంధిత ఉద్యోగులకు ఈ మెయిల్స్ అందడం ప్రారంభమైంది.
ముందస్తు సమాచారం లేకుండానే..
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ తొలగింపులు జరుగుతుండటం ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తెల్లవారుజామున 5 - 6 గంటల సమయంలో ‘మీ స్థానం తొలగించబడింది’ అంటూ ఇమెయిల్స్ వచ్చాయని, వెంటనే ఇంటర్నల్ సిస్టమ్స్ యాక్సెస్ (Internal Systems Access)ను కూడా రద్దు చేశారని బాధితులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న సీనియర్లకు కూడా ఈ చేదు అనుభవం తప్పలేదు.
భారత్‌లోనూ భారీ ప్రభావం?
ఈ లేఆఫ్స్ ప్రభావం కేవలం అమెరికా (America)కే పరిమితం కాకుండా భారత్, మెక్సికో వంటి దేశాల్లోని టీమ్‌లపై కూడా పడనుందని నివేదికలు చెబుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing), ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసే వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒరాకిల్‌లో 1.62 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, తాజా నిర్ణయంతో సుమారు 18 శాతం మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లపై పెట్టుబడులను పెంచేందుకే ఈ వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ప్రాధాన్యత లేని విభాగాల్లో ఖర్చు తగ్గించి, ఏఐ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలని ఒరాకిల్ భావిస్తోంది.






