- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Elon Musk: 14వ బిడ్డకు జన్మనిచ్చిన ఎలాన్ మస్క్.. ఏం పేరు పెట్టారంటే?
ప్రపంచ కుబేరుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ (Elon musk) మరోసారి తండ్రి అయ్యాడు. ఇప్పటికే 13 మంది పిల్లలకు తండ్రి అయిన మస్క్.. 14వ బిడ్డకి స్వాగతం పలికాడు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, ఎలోన్ మస్క్ భాగస్వామ్యి అయిన శివోన్ జలిస్‌కు మగబిడ్డ పుట్టాడు. ఆ చిన్నారికి 'సెల్డాన్ లైకుర్గస్' అని పేరు పెట్టినట్లు శివోన్ జిలిస్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆమె ట్వీట్‌కు హార్ట్ సింబల్‌తో ఎలాన్ మస్క్ రిప్లయ్ ఇచ్చాడు.
కాగా, వీరికి ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, తాజాగా 4వ సంతానానికి జన్మనిచ్చారు. 2021లో మస్క్ జిలిస్ కవల పిల్లలకు (స్ట్రైడర్ , అజూర్) జన్మనిచ్చారు. 2024లో జిలిస్ మూడవ బిడ్డకు ( ఆర్కాడియా) జన్మనిచ్చింది. ఎక్కువమంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని, తన మాటలు రాసిపెట్టుకోవాలని గతంలో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక 52 ఏళ్ల ఈ టెక్ దిగ్గజం పలువురు మహిళల ద్వారా 14 మందికి తండ్రి అయ్యాడు. మస్క్ మొదటి భార్య జస్టిన్‌కు 2002లో జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో వారిద్దరూ విడిపోయారు. ఇక కెనడియన్ గాయని గ్రిమ్స్‌కు మస్క్ కారణంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం మస్క్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా.. తాజాగా ఈ జంట నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది.
ఇటీవల తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ రచయిత్రి ఆష్టీ సెయింట్ క్లెయిర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితమే తానో బిడ్డకు జన్మనిచ్చానని అయితే గోప్యత, భద్రతా కారణాల వల్ల ఈ విషయం బహిర్గతం చేయలేదని ఆమె తెలిపారు. దీనిపై ఇప్పటివరకు మస్క్ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు.






