- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSBs: ప్రభుత్వ బ్యాంకుల్లో 13 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు
దీంతో ఈ బ్యాంకుల మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.15 లక్షల నుంచి 6.28 లక్షలకు పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కల్పన మరోసారి వేగం అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో ఎనిమిది బ్యాంకులు కలిపి 13,223 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఈ బ్యాంకుల మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.15 లక్షల నుంచి 6.28 లక్షలకు పెరిగింది. ఇందులో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడం ద్వారా ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించింది. ఎస్‌బీఐ ఒక్కటే 8,905 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవడంతో బ్యాంకు మొత్తం సిబ్బంది సంఖ్య 2.36 లక్షల నుంచి 2.45 లక్షలకు చేరింది. అంటే ఈ ఎనిమిది బ్యాంకుల్లో జరిగిన మొత్తం నియామకాలలో దాదాపు 67 శాతం వాటా ఎస్‌బీఐదే కావడం విశేషం.
డిజిటలైజేషన్, ఆటోమేషన్ వేగంగా పెరుగుతున్నప్పటికీ బ్యాంకులు ఇంకా భారీగా మానవ వనరులపైనే ఆధారపడుతున్నాయనే సంకేతాలను ఈ గణాంకాలు ఇస్తున్నాయి. వ్యాపార విస్తరణ, కస్టమర్ సేవలు, రిస్క్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, బ్రాంచ్ కార్యకలాపాల కోసం కొత్త సిబ్బందిని నియమించుకుంటున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 1,685 మందిని, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1,005 మందిని, కెనరా బ్యాంక్ 567 మందిని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 527 మందిని అదనంగా నియమించుకున్నాయి. మెరుగైన ఆర్థిక ఫలితాలు, బ్యాలెన్స్ షీట్లు, పెరుగుతున్న వ్యాపార పరిమాణం ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.






