Cyber Security: కంపెనీలకు అత్యంత ప్రమాదంగా మారుతున్న సైబర్ దాడులు

by S Gopi |

కంపెనీలు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లలో కస్టమర్ డిమాండ్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఉన్నాయి.

Cyber Security: కంపెనీలకు అత్యంత ప్రమాదంగా మారుతున్న సైబర్ దాడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనలు, దాడులు భారతీయ కంపెనీల పనితీరుకు ప్రధాన ముప్పుగా మారాయని పరిశ్రమల సంఘం ఫిక్కీ-ఈవై రిస్క్ సర్వే నివేదిక వెల్లడించింది. 51 శాతం కంపెనీల యజమానులు ఇవే తమ ప్రధాన ఆందోళన అని తెలిపారు. ఆదివారం విడుదల ఫిక్కీ-ఈవై నివేదిక ప్రకారం, కంపెనీలు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లలో కస్టమర్ డిమాండ్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఉన్నాయి. నిర్వహణ కార్యకలాపాల్లో అన్ని కంపెనీలకు టెక్నాలజీ ప్రమాదమే అత్యంత కీలకంగా మారింది. అలాగే, వేగంగా మారుతున్న సాంకేతిక మార్పు, డిజిటల్ అంతరాయాలు పరిశ్రమలో పోటీ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాయని 61 శాతం మంది కంపెనీల యజమానులు భావిస్తున్నారు. 57 శాతం మంది డేటా చోరీ, అంతర్గత మోసాలు ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నాయి. వీటన్నిటి కంటే కొత్తగా అభివృద్ధి చెందుతున్న సైబర్ బెదిరింపులను పరిష్కరించడంలో అత్యంత కష్టంగా ఉందని 47 శాతం కంపెనీలు తెలిపాయి. ఇదే సమయంలో ఏఐతో సహా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అవసరమైనంత మేర స్వీకరించకపోవడం కూడా కంపెనీలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నట్టు 60 శాతం మంది కంపెనీల యజమానులు పేర్కొన్నారు.

Next Story