పెరిగిన వెజ్ భోజనం, తగ్గిన నాన్-వెజ్ ధర

by Dishanational1 |
పెరిగిన వెజ్ భోజనం, తగ్గిన నాన్-వెజ్ ధర
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఆసక్తికర నివేదిను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులు కూరగాయలు కొనసాలంటే ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంలో ఒక వెజ్ భోజనం ధర 5 శాతం పెరిగిందని, ఇదే సమయంలో నాన్-వెజ్ 13 శాతం తగ్గిందని క్రిసిల్ తెలిపింది. బుధవారం కంపెనీ 'రోటీ రైస్ రేట్' పేరుతో వెలువరించిన నివేదిక ప్రకారం, వెజ్ భోజనంలో రోటీ, ఉల్లిపాయ, టమోటా, బంగాళాదుంపలు, బియ్యం, పప్పు, పెరుగు, సలాడ్‌లు ఉంటాయి. నాన్-వెజ్ భోజనంలో అన్ని ఉంటాయి, కానీ పప్పు బదులు మాంసం ఉంటుంది. అందుకే ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉందని క్రిసిల్ అభిప్రాయపడింది. గతేడాది జనవరి వెజ్ థాలీ సగటున రూ. 26.6 ఉండగా, గత నెలలో ఇది రూ. 28కి పెరిగింది. అలాగే, నాన్-వెజ్ థాలీ సగటు ధర 2023, జనవరిలో రూ. 59.9 నుంచి ఈ ఏడాది జనవరిలో రూ. 52కి తగ్గింది. వెజ్ థాలీ ధర పెరిగేందుకు ప్రధానంగా టమోటా ధరలు 20 శాతం, ఉల్లి ధరలు 35 శాతం పెరిగాయి. బియ్యం కూడా 14 శాతం, పప్పుల ధరలు 21 శాతం పెరిగాయి. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణమే వెజ్ థాలీ పెరిగేందుకు కారణమని నివేదిక అభిప్రాయపడింది. 2023, జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 5.94 శాతం ఉంది. గత నెలకు సంబంధించి వచ్చే వారం డేటా విడుదల కానుంది. అంతకుముందు డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతం, ఆహార ద్రవ్యోల్బణం 9.53 శాతంగా ఉంది.

మరోవైపు, నాన్-వెజ్ థాలీ ధర బ్రాయిలర్ చికెన్ ధర 26 శాతం తగ్గడం వల్ల దిగొచ్చింది. నాన్-వెజ్ థాలీ మొత్తం ఖరీదులో బ్రాయిలర్ వాటా 50 శాతం ఉంటుంది. 2023, డిసెంబర్‌తో పోలిస్తే నెలవారీగా వెజ్, నాన్-వెజ్ థాలీల ధర వరుసగా 6 శాతం, 8 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఉల్లి 26 శాతం, టొమాటో 16 శాతం తగ్గడమే ఇందుకు కారణం. బ్రాయిలర్ ధరలు నెలవారీగా 8-10 శాతం మేర తగ్గడంతోనే నాన్-వెజ్ థలీ సగటు ధర వేగంగా తగ్గిందని నివేదిక పేర్కొంది.


Next Story

Most Viewed